శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 02, 2020 , 18:45:19

వరంగల్ జిల్లాలో పిడుగుపాటుకు గొర్రెలు, మేకలు మృతి

వరంగల్ జిల్లాలో పిడుగుపాటుకు గొర్రెలు, మేకలు మృతి

వరంగల్ అర్బన్ : వరంగల్ నగరంలో కొద్దిసేపటి క్రితం భారీ ఉరుములతో వర్షం కురిసింది. వీధులన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా వర్షం పడటంతో నగర వాసులు ఉలిక్కిపడ్డారు. మొన్నటి భారీ వర్షాలకు ఇప్పుడుడిప్పుడే తేరుకుంటున్నారు. కాగా, నగరానికి సమీపంలో ఉన్న భట్టుపల్లి గ్రామంలో పిడుగు పడి జక్కుల కుమారస్వామికి చెందిన ఆరు గొర్రెలు నాలుగు మేకలు మృతి చెందాయి. బాధితుడుని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


logo