బుధవారం 27 జనవరి 2021
Crime - Oct 06, 2020 , 16:38:00

దుబాయ్‌లో రోడ్డు ప్ర‌మాదం.. శంషాబాద్ వాసి మృతి

దుబాయ్‌లో రోడ్డు ప్ర‌మాదం.. శంషాబాద్ వాసి మృతి

రంగారెడ్డి : దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో శంషాబాద్ వాసి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. శంషాబాద్‌కు చెందిన మహమ్మద్ అసద్ కుటుంబ‌ సభ్యులతో కలిసి 15 రోజుల క్రితం దుబాయ్ వెళ్లాడు. దుబాయ్ ప‌ర్య‌ట‌న ముగించుకుని గత రాత్రి భార‌త్‌కు తిరిగి వచ్చేందుకు విమానాశ్ర‌యానికి వస్తుండగా షార్జాలో రోడ్డు ప్రమాదానికి గుర‌య్యారు.  కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుత‌ప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అసద్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా భార్య కొడుకు, చెల్లి, బావ తీవ్ర‌గాయాల‌పాల‌య్యారు. అస‌ద్ మృతితో స్థానికంగా విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. 


logo