శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jul 24, 2020 , 16:04:14

మైనర్‌ బాలుడిపై లైంగిక వేధింపులు

మైనర్‌ బాలుడిపై లైంగిక వేధింపులు

ముంబై :  ముంబైలోని ధారావిలో ఎనిమిదేళ్ల బాలుడిని లైంగికంగా వేధించినందుకు గాను 25 ఏండ్ల యువకుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం ఎంజీరోడ్డులోని గణపతిపాడ చాల్‌లో జరిగినట్లు తెలిసింది. ఇంటి పక్కన నివసించే 8 ఏండ్ల బాలుడిని ఆడుకోవడానికి బొమ్మలు ఇస్తానని చెప్పి యువకుడు పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. ధైర్యం చేసి బాలుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo