చార్మినార్: తల్లి తరువాత ఆ స్థానాన్ని పొందిన వదినపై కన్నేశాడు. పలుమార్లు బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అతని వ్యవహారం శృతి మించడంతో నిందితునిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీర్‌చౌక్ పోలీస్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలోని పురాణిహవేలిలో నివసించే ఫయాజ్ అలీ (41) భాదితురాలు (26) భార్యభర్తలు. ఫయాజ్ అలీ సోదరుడు అయిన ఇర్ఫాన్ (28) కూడా వారితో కలిసి ఉంటున్నాడు.
ఫయాజ్ అలీ ఏసీ మెకానిక్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, ఇర్ఫాన్ కార్ల వాషింగ్ నిర్వహిస్తుంటాడు. వదినపై కన్నేసిన ఇర్ఫాన్ బాధితురాలిని పలుమార్లు బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల ఇర్ఫాన్ ఆగడాలు శృతి మించడంతో బాధితురాలు తన భర్త ఫయాజ్అలీకి విషయాన్ని తెలియజేసింది. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న భాదితురాలు ఇర్ఫాన్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారని ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపారు.