సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 11, 2020 , 21:39:28

త‌ల్లీకూతుళ్ల‌పై లైంగిక‌దాడి కేసులో వ్య‌క్తి అరెస్ట్‌

త‌ల్లీకూతుళ్ల‌పై లైంగిక‌దాడి కేసులో వ్య‌క్తి అరెస్ట్‌

గురుగ్రామ్ : ఈ ఏడాది మార్చి నెల‌లో 30 ఏండ్ల మ‌హిళ‌,  ఆమె 14 ఏండ్ల  కుమార్తెపై గన్‌పాయింట్ వద్ద లైంగిక‌దాడికి పాల్ప‌డిన కేసులో ఒక వ్య‌క్తిని హ‌ర్యానా రాష్ర్టం గురుగ్రామ్ పోలీసులు శుక్ర‌వారం అరెస్టు చేశారు. హరీశ్‌ అలియాస్ అషుగా గుర్తించిబ‌డిన నిందితుడిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ప్ర‌స్తుతం వేరే కేసులో భోండ్సి జైలులో శిక్ష అనుభ‌విస్తున్నాడు.  

పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ మహిళ త‌న 14 ఏండ్ల కుమార్తె, 9 ఏండ్ల కుమారుడితో గార్హి గ్రామంలో నివాసం ఉంటుంది. మ‌హిళ భ‌ర్త అనారోగ్యంతో జూన్ 28న మ‌ర‌ణించాడు. అదే గ్రామానికి చెందిన భ‌ర్త స్నేహితుడు హ‌రీశ్.. కుటుంబానికి ద‌గ్గ‌రై త‌ల్లీకూతుళ్ల‌పై ఏక కాలంలో లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యం బ‌య‌టికి చెబితే చంపేస్తాన‌ని ఇద్ద‌రినీ బెదిరించాడు. ధైర్యం చేసుకొని మ‌హిళ ఓరోజు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అప్ప‌టికే వేరే కేసులో శిక్ష అనుభ‌విస్తున్న నిందితుడిపై మ‌రో కేసు న‌మోదు చేశామ‌ని, త్వ‌ర‌లో కోర్టులో హాజరు ప‌రుస్తామ‌ని సబ్ ఇన్స్‌పెక్ట‌ర్ సరోజ్ దేవి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo