శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jul 27, 2020 , 17:12:34

ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి

ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి

న్యూ ఢిల్లీ : ఉత్తర ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో మైనర్ బాలికను అపహరించి లైంగికదాడికి పాల్పడిన కేసులో పోలీసులు సోమవారం ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. వివరాలు..  సుడామా అనే 40 ఏండ్ల వ్యక్తి నబీ కరీం ప్రాంతంలో నివాసం ఉండేవాడు.  ఇతను సదర్ బజార్‌లో కార్డ్‌ పుల్లర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి పని ముగించుకుని సుడామా ఫూటుగా మద్యం సేవించి వస్తున్నాడు. ఇదే సమయంలో సదర్‌నగర్‌లో ఓ ఇంటి వెలుపల తన అమ్మమ్మతో నిద్రిస్తున్న ఎనిమిదేండ్ల బాలికను సుడామా సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాసేపయ్యాక నిద్ర లేచిన బాలిక అమ్మమ్మ పక్కన చిన్నారి లేకపోవడాన్ని గమనించి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసింది. చుట్టు పక్కల వెతకగా బాలిక ఏడుస్తూ ఇంటి సమీపంలోకి రావడంతో సముదాయించి పడుకోబెట్టారు.

మరుసటి రోజు ఉదయం బాలకకు తీవ్ర రక్తస్రావం అవుతుండగా అనుమానం వచ్చి, కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించగా లైంగికదాడి జరిగిందని తేల్చారు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారు బాలికను వివరాలు అడగ్గా ఆమె మరాఠిలో మాట్లాడుతుంది. బాలికతో సంభాషించడానికి మరాఠి మాట్లాడే మహిళను రప్పించి ఆమె ద్వారా లైంగికదాడి వివరాలు సేకరించి శనివారం సుడామాను అరెస్టు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్‌) 376 (లైంగికదాడి) పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo