శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 25, 2020 , 17:31:00

ఆరేళ్ల చిన్నారిపై లైంగికయత్నం

ఆరేళ్ల చిన్నారిపై లైంగికయత్నం

ఖ‌మ్మం : ఆరేళ్ల చిన్నారిపై  ఓ కామాంధుడు లైంగిక‌దాడికి య‌త్నించాడు. ఈ దారుణ సంఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లా బోన‌క‌ల్లు మండ‌లం పెద్ద బీర‌వ‌ల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 62 ఏళ్లు వృద్ధుడు బొల్లె పోగు వెంకటేశ్వర్లు ఈ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పక్కపక్క ఇండ్లు కావ‌డంతో చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి పిలుచుకొని తలుపులు వేసి  హత్యచారం చేయబోయాడు.

వృద్ధుడు త‌న సోద‌రిని తీసుకువెళ్లిన విష‌యాన్ని త‌మ్ముడు తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా చిన్నారిపై లైంగిక దాడి చేసేందుకు య‌త్నిస్తున్న వృద్ధుడిని ప‌ట్టుకుని పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు వెంట‌నే సంఘటన స్థలానికి చేరుకొని వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చ‌ట్టం కింద‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు.


logo