శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 26, 2020 , 17:20:31

మైనర్‌ విద్యార్థినిపై తరగతి గదిలోనే లైంగిక దాడి.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌

మైనర్‌ విద్యార్థినిపై తరగతి గదిలోనే లైంగిక దాడి.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌

గోరఖ్‌పూర్‌ : ఓ పాఠశాల నిర్వాహకుడు విద్యార్థినికి మాయమాటలు చెప్పి తరగతి గదిలోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ తతంగాన్ని వీడియో తీసి నెలరోజుల పాటు బ్లాక్‌మెయిల్‌ చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. 

వివరాలు.. గోరఖ్‌పూర్‌లోని ఆర్‌ఎం పబ్లిక్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ హరేంద్ర యాదవ్‌(38) తన పాఠశాలలో చదువుతున్న 15 ఏండ్ల 7వ తరగతి విద్యార్థినిపై కన్నేశాడు. లాక్‌డౌన్‌ వల్ల పాఠశాలలు మూసి ఉండడంతో జూలై 30న బాలిక ఇంటికి ఫోన్‌ చేసి మాయమాటలు చెప్పి స్కూల్‌కు రావాల్సిందిగా ఆదేశించాడు. సరేనని పాఠశాలకు వెళ్లిన బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మొత్తం తతంగాన్ని వీడియో తీసి.. ఎవరికైనా చెబితే వీడియో సోషల్‌ మీడియాలో పెడతానని, తాను పిలిచినప్పుడల్లా వచ్చి కోరిక తీర్చాలని నెల రోజుల పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. 

ధైర్యం చేసి బాధితురాలు ఓ రోజు విషయాన్ని తండ్రికి చెప్పడంతో అతడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించగా ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడు స్థానిక జర్నలిస్ట్ సోదరుడని, అందువల్లే మొదట పోలీసులు పట్టించుకోలేదని  బాలిక తండ్రి ఆరోపించాడు. నిందితుడు పరారీలో ఉండగా అతడికోసం వెతుకుతున్నట్లు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo