సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 14, 2020 , 12:17:14

అనాథాశ్రమంలో మైనర్‌పై ఏడాది పాటు లైంగిక దాడి.. బాలిక మృతి

అనాథాశ్రమంలో మైనర్‌పై ఏడాది పాటు లైంగిక దాడి.. బాలిక మృతి

హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదుకుంటుందనుకున్న అనాథాశ్రమం ఆ బాలిక పాలిట మృత్యు పాశంగా మారింది. అనాథాశ్రమానికి ఫౌండర్‌గా ఉన్న వ్యక్తి మైనర్‌ బాలికపై పదే పదే లైంగిక దాడికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. తరువాత తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో దవాఖానలో చేర్చగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాలు.. అమీన్‌పూర్‌లోని అనాథాశ్రమంలో ఓ 14 ఏండ్ల బాలికపై ఫౌండర్‌గా ఉన్న వేణుగోపాల్‌రెడ్డి అనే వ్యక్తి శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చి పదే పదే లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇలా ఆమెను భయపెట్టి, బెదిరించి ఏడాది పాటు లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. ఇటీవల లాక్‌డౌన్‌ కారణంగా బాలిక తన చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఏమైందని చిన్నమ్మ అడగ్గా జరిగిన విషయాన్ని ఆమెకు తెలియపర్చడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరిలించారు. బాలిక పరిస్థితి విషమంగా మారి చికిత్స పొందుతూ బుధవారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. 

ఐదు రోజుల క్రితం బాలికను దవాఖానలో చేర్పించగా బుధవారం ఉదయం చికిత్సకు స్పందించకుండా ఆమె మరణించినట్లు పోలీసు అధికారి తెలిపారు. ముగ్గురు అనాథాశ్రమ నిర్వాహకులతో పాటు ఓ51 ఏళ్ల వ్యక్తి, అనాథాశ్రమ దాత బాలికపై లైంగికదాడికి పాల్పడినట్లు ఈ నెల మొదట్లో బాలిక ఫిర్యాదులో తెలిసిందన్నారు. ఆమెపై ఒక సంవత్సరం పాటు లైంగికదాడి జరిగినట్లు తెలిసిందని వారు పేర్కొన్నారు. ఈ కేసులో ఆశ్రమ నిర్వాహకులతో పాటు, ఇన్‌చార్జి మహిళ, అమె సోదరుడిని ఆదివారం అరెస్టు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత ఆమె మరణంపై కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo