అడ్డగుట్ట : ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అడ్డగుట్ట లోహియనగర్ ప్రాంతానికి చెందిన యువకుడు బురాన్ (21) కూరగాయాలు విక్రయిస్తుంటాడు.
అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక (16) తో పరిచయం ఏర్పరచుకున్నాడు. తనను ప్రేమిస్తున్నానని చెప్పి ఈ ఏడాది జనవరి 25న ఇంటికి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం రెండు వారాల తర్వాత మళ్లీ ఆమెను ఇంటికి రమ్మని చెప్పి మరోసారి లైంగికంగా అనుభవించాడు.
కాగా మూడు నెలలుగా బాలిక ఆరోగ్య పరిస్థితుల్లో తేడాను గమనించిన తల్లి అనుమానం వచ్చి ఈ నెల 23న ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించింది. దీంతో బాలిక మూడు నెలల గర్భవతని అని నిర్థారించారు. బాలికను గట్టిగా మందలించడంతో అసలు విషయం చెప్పింది.
కాగా గురువారంసాయంత్రం బాధితురాలి తల్లి తుకారాంగేట్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బురాన్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.