మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 04, 2020 , 13:02:06

వివాహితపై లైంగికదాడి

వివాహితపై లైంగికదాడి

అల్లియా : దేశంలో ఎక్కడో ఒకచోట మహిళలపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం సుఖ్‌పురా ప్రాంతంలోని ఓ గ్రామంలో ఆదివారం రాత్రి ఓ మహిళపై వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. వివరాలు.. గ్రామానికి చెందిన ఆర్‌సింగ్‌(25) స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకొని జీవనం సాగించేవాడు. అదే గ్రామంలో ఓ 27 ఏండ్ల మహిళ ఒంటరిగా నివాసం ఉండేది.  ఆగస్టు 2న, ఆదివారం రాత్రి ఆమె నిద్రలో ఉండగా ఆర్‌సింగ్‌ ఇంట్లోకి ప్రవేశించి లైంగికదాడికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి మహిళను వైద్య పరీక్షల కోసం దవాఖానకు తరలించినట్లు సుఖ్‌పురా ఎస్‌హెచ్‌ఓ వీరేంద్ర యాదవ్ మంగళవారం తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo