బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 06, 2020 , 18:53:26

బాలికపై ఏడాదిగా లైంగిక దాడి

బాలికపై ఏడాదిగా లైంగిక దాడి

ఎలమంచిలి : ఓ బాలికపై ముగ్గురు కామాంధులు ఏడాదిగా లైంగికదాడికి పాల్పడ్డారు. ఫలితంగా బాలిక గర్భం దాల్చడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం ఎలమంచిలి జిల్లా కొత్తలి గ్రామానికి చెందిన ఓ బాలిక(15) తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. దీంతో ఆమె తాతయ్య, అమ్మమ్మ వద్ద ఉంటోంది. బాలిక 9 వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. అమ్మమ్మ, తాతయ్యలు కూలి పనికి వెళ్తుండడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఇదే అదునుగా భావించిన ముగ్గురు కామాంధులు  ఏడాదిగా బాలికను బెదిరించి లైంగికదాడికి పాల్పడుతున్నారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. 

పొట్ట లావవుతుండడంతో గమనించిన ఆమె అమ్మమ్మ దవాఖానకు తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి ఆరు నెలల గర్భవతి అని చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఆ తరువాత బాలికను ప్రశ్నించగా అసలు గుట్టు బయటపడింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని బాలికను అనకాపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితులు ముగ్గురు స్థానికంగా కూలి పనులు చేసుకొని బతికేవారని తెలిసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo