శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 04, 2020 , 15:07:18

75 ఏండ్ల వృద్ధురాలిపై లైంగికదాడి

75 ఏండ్ల వృద్ధురాలిపై లైంగికదాడి

కొచ్చి :  75 ఏళ్ల వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడి, దారణంగా కొట్టిన ఘటన కేరళ రాష్ర్టం కొచ్చిలో చోటుచేసుకుంది. ఈ కేసులో ముగ్గురు యువకులను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. కొచ్చికి చెందిన ఓ వృద్దురాలు ఆదివారం మధ్యాహ్నం తమలపాకులు కావాలని స్థానికంగా ఉండే యువకులకు చెప్పింది. ఇప్పిస్తామని చెప్పి ఆ వృద్ధురాలిని యువకులు స్థానికంగా ఉండే ఒక ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడి చేసి తీవ్రంగా కొట్టారు. 

వృద్ధురాలి కేకలు, అరుపులను విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని చూడగా తీవ్ర రక్తస్రావంతో పడి ఉంది. వెంటనే దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో కోలెన్చేరిలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలకు తరలించి, వైద్యులు నిశితంగా పరిశీలించి అత్యవసర ఆపరేషన్‌ చేశారు. 

ఆమె శరీరంలో ప్రైవేట్‌ భాగాలు బాగా దెబ్బతిన్నాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ లైంగికదాడి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo