బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 26, 2020 , 18:40:50

పదేండ్ల బాలికపై లైంగికదాడి, హత్య.. కండ్లు పీకి రాక్షసానందం పొందిన దుండగులు

పదేండ్ల బాలికపై లైంగికదాడి, హత్య.. కండ్లు పీకి రాక్షసానందం పొందిన దుండగులు

పాల్వాల్‌ (హర్యానా) : పదేండ్ల బాలికను దుండగులు అపహరించి లైంగిక దాడికి పాల్పడి, ఆపై హత్య చేసిన ఘటన హర్యానాలోని పాల్వాల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. 

పాల్వల్‌ జిల్లాలోని హోడల్‌ గ్రామానికి చెందిన బాలిక సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ మహేంద్ర నిర్లక్ష్యంగా మాట్లాడి, కేసు నమోదు చేయడానికి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. 

మరుసటి రోజు మంగళవారం మధ్యాహ్నం గ్రామస్తులు పొలాల వైపు వెళ్లగా అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న బాలిక మృతదేహం కనబడడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని దుండగులు బాలికను కిడ్నాప్‌ చేసి అత్యంత దారుణంగా కండ్లు పీకి లైంగికదాడికి పాల్పడి ఉంటారని తల్లిదండ్రులు, గ్రామస్తులు భావించి పోలీస్‌ ఉన్నతాధికారులను ఆశ్రయించారు.  

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో బాలిక తప్పిపోయినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే పాప ప్రాణాలు దక్కేవని గ్రామస్తులు బాలిక మృతదేహంతో నిరసన చేపట్టగా.. నిర్లక్ష్యం వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని  ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo