మంగళవారం 19 జనవరి 2021
Crime - Nov 09, 2020 , 10:19:03

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఘోర ప్ర‌మాదం.. ఏడుగురు మృతి

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఘోర ప్ర‌మాదం.. ఏడుగురు మృతి

భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని స‌త్నా జిల్లాలో సోమ‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఎదురెదురుగా వేగంగా వ‌చ్చిన కారు, ట్ర‌క్కు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే ఆరుగురు మృతి చెంద‌గా, మ‌రో వ్య‌క్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు, స్థానికులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి.. క్ష‌త‌గాత్రుల‌ను రేవా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. క్ష‌త‌గాత్రుల ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మ‌హిళ‌లు, ముగ్గురు పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. ఓ సంతాప స‌భ‌కు హాజరై తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.