శనివారం 06 మార్చి 2021
Crime - Jan 23, 2021 , 13:59:08

చోరీ త‌మిళ‌నాడులో.. దొరికింది హైద‌రాబాద్‌లో..

చోరీ త‌మిళ‌నాడులో.. దొరికింది హైద‌రాబాద్‌లో..

హైద‌రాబాద్ : త‌మిళ‌నాడు హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచీలోకి నిన్న దొంగ‌లు ప్ర‌వేశించి.. 25,091 గ్రాముల బంగారాన్ని అప‌హ‌రించిన విష‌యం విదిత‌మే. అయితే బంగారాన్ని దొంగిలించిన గ్యాంగ్ హైద‌రాబాద్ మీదుగా జార్ఖండ్‌, బీహార్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడు నుంచి జాతీయ ర‌హ‌దారి 44పై వెళ్తున్న ఆ గ్యాంగ్‌ను తెలంగాణ పోలీసులు గుర్తించారు. హైద‌రాబాద్ శివార్ల‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున‌ ఎన్‌హెచ్ 44పై సైబ‌రాబాద్ పోలీసులు బంగారం చోరీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. దొంగిలించిన బంగారం విలువ రూ. 7.5 కోట్ల విలువ ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. బంగారంతో పాటు రూ. 96వేల న‌గ‌దును కూడా పోలీసులు సీజ్ చేశారు. 

గ‌న్‌పాయింట్‌లో బెదిరించి..

ఏడుగురు స‌భ్యుల గ్యాంగ్ శుక్ర‌వారం ఉద‌యం హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచీ వ‌ద్ద‌కు చేరుకుంది. ఆ ఏడుగురు ముఖాల‌కు మాస్కులు ధ‌రించారు. ఇక గేట్ వ‌ద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. సెక్యూరిటీని కూడా బ్రాంచీ లోప‌లికి తీసుకెళ్లారు. ఆ త‌ర్వాత సిబ్బందిని గ‌న్‌పాయింట్‌లో బెదిరించి.. 25,091 గ్రాముల బంగారాన్ని, రూ. 96 వేల న‌గదును దోచుకున్నారు. అనంత‌రం దుండ‌గులు బ‌య‌ట‌కు వ‌చ్చి బైక్‌ల‌పై అక్క‌డ్నుంచి పారిపోయారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు టోల్‌గేట్ డేటా, సాంకేతిక ప‌రిజ్ఞానంతో దొంగ‌ల‌ను ప‌ట్టుకున్నారు. ఎన్‌హెచ్ 44పై నార్త్ ఇండియా వెళ్తుండ‌గా సైబ‌రాబాద్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఐదుగురిని తొండుప‌ల్లి గేట్ వ‌ద్ద అదుపులోకి తీసుకోగా, మ‌రో ఇద్ద‌రిని మేడ్చ‌ల్ వ‌ద్ద అరెస్టు చేశారు.

దొంగల ముఠా..

1. రూప్ సింగ్ భ‌గాల్‌(22, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌)

2. శంక‌ర్ సింగ్ బ‌య్యాల్‌(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌)

3. ప‌వ‌న్ కుమార్ బిస్కార్మ‌(జార్ఖండ్‌)

4. భూపేంద‌ర్ మాంజీ(24, జార్ఖండ్‌)

5. వివేక్ మండ‌ల్‌(32, జార్ఖండ్‌)

6. టికారం(55, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌)

7. రాజీవ్ కుమార్ (35, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌). 

VIDEOS

logo