శుక్రవారం 05 మార్చి 2021
Crime - Feb 23, 2021 , 18:11:17

ఏడుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు

ఏడుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు

ములుగు : మావోయిస్టులకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్న ఏడుగురు మిలీషియా సభ్యులను ములుగు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి భారీ ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన సాయంత్రం 7గంటలకు చెలిమెల, జెల్ల, పామునూరు గ్రామానికి చెందిన మిలీషియా సభ్యులు కొంత మంది అడవుల్లో కూంబింగ్‌ చేస్తున్న పోలీస్‌ పార్టీని చంపాలనుకున్నారు.

ఈ మేరకు పామునూరు అటవీ ప్రాంతంలో పేలుడు సామగ్రి అమరుస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. వీరు మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల ఆదేశాల మేరకు అక్కడ సంచరిస్తున్నట్లు తెలిపారు.  పామునూరు అటవీ ప్రాంతంలోకి కూంబింగ్‌ చేస్తుండగా 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొందరు అటవీ ప్రాంతంలో పేలుడు సామగ్రిని అమరుస్తూ కనిపించారు. పోలీసులను చూసి వారు పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నామని పేర్కొన్నారు. ఇందులో ఏడుగురు పేలుడు సామగ్రితో పట్టుబడ్డారు. 

పట్టుబడిన వారిలో వెంకటాపురం మండలం జెల్లా గ్రామానికి చెందిన మిలీషియా సభ్యులు  ఉండం పాండు, మచ్చకి భీమయ్య, సోడి లక్ష్మయ్య, మడకం అలియాస్‌ మడవి అడమయ్య, మడవి బుద్ర, మడవి ఐతయ్య, మడవి కోస అని విచారణలో తేలిందన్నారు. వీరి నుంచి 9 ల్యాండ్‌మైన్స్‌, 80 మీటర్ల కార్డెక్స్‌వైర్‌, 50డిటోనేటర్లు, 1 బ్యాటరీ, ఒక వాకీ టాకీ, 2 రిమోట్‌ కార్‌ కీలు, బొగ్గుతో తయారు చేసిన డైరెక్షనల్‌ మైన్‌, మొబైల్‌ చార్జీలు, బ్యాటరీలు, 8బాణాలు, బీరు, టిఫిన్‌ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిపై గతంలో పలు కేసులు కూడా ఉన్నాయన్నారు. సమావేశంలో ఓఎస్డీ శోభన్‌కుమార్‌, ఏఎస్పీ గౌస్‌ ఆలం, పోలీస్‌ అధికారులు ఉన్నారు. 

ఇవి కూడా చదవండి..

మిరియాలతో బరువు ఎలా తగ్గవచ్చంటే..? 

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కన్నెపల్లి ( లక్ష్మి ) పంపుహౌస్‌లో శవం లభ్యం

టూల్ కిట్ కేసులో దిశ ర‌వికి బెయిల్‌ 

VIDEOS

logo