గురువారం 21 జనవరి 2021
Crime - Nov 24, 2020 , 18:23:29

జ్యువెల్లరీ షాపులో చోరీ..ఏడు కిలోల వెండి అపహరణ

జ్యువెల్లరీ షాపులో చోరీ..ఏడు కిలోల వెండి అపహరణ

నల్లగొండ :  జిల్లాలోని కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో గల శ్రీ వేంకటేశ్వర జ్యువెల్లరీ షాపులో మంగళవారం తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు ఏడు కిలోల వెండిని అపహరించుకుపోయారని షాపు యజమాని వెంకటేశ్వర్లు తెలిపారు. దుకాణం వెనుక భాగంలో ఉన్న వెంటిలెటర్‌ను తొలగించి షాపులోకి ప్రవేశించిన ఆనవాళ్లు కనబడుతున్నాయి. క్లూస్‌ టీం వేలి ముద్రలను సేకరించింది. నల్లగొండ నుంచి డాగ్‌ స్కాడ్‌ను రప్పించారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి పరిశీలించి వివరాలను సేకరించారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


logo