శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 07, 2020 , 16:53:34

భారీగా గంజాయి పట్టివేత.. ఆరుగురు అరెస్టు

భారీగా గంజాయి పట్టివేత.. ఆరుగురు అరెస్టు

ఘజియాబాద్ : ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ర్టం ఘజియాబాద్‌లో శుక్రవారం ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కౌషాంబి నుంచి యశ్, ఆదిత్య, మయాంక్, నిచికేట, ఆసిఫ్, సాజిద్‌ అనే యువకులు కారు, ద్విచక్రవాహనంలో గంజాయిని తరలిస్తుండగా అనుమానం వేసి తనిఖీలు చేపట్టగా వారి వద్ద 7 కేజీల గంజాయి ఉన్నట్లు కౌషాంబి, విజయ్‌నగర్‌ పోలీసులు తెలిపారు. 

నిందితులను అరెస్టు చేసి విచారణ చేయగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) నగరాల్లో ఈ నిషేధిత మత్తు పదార్థాలను విక్రయించడానికి తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి సెలఫోన్లు, కారు, బైక్‌, కొంత నగదును స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు  ఎస్పీ కళానిధి నైతాని పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo