సోమవారం 26 అక్టోబర్ 2020
Crime - Sep 27, 2020 , 12:19:42

లారీని ఢీకొట్టిన కారు.. ఏడుగురు దుర్మరణం

లారీని ఢీకొట్టిన కారు.. ఏడుగురు దుర్మరణం

కలబురగి : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు వెంట నిలిపిన ట్రక్కును ఢీకొట్టింది. కలబురిగి జిల్లా సవలగి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజూమున జరిగిన ఈ దుర్ఘనలో గర్భిణీతో సహా  ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా అలండ్ పట్టణానికి చెందిన వారని, గర్భిణీని ప్రసవం కోసం కలబురిగికి తీసుకువస్తుండగా ప్రమాదానికి గురయ్యారని పోలీసులు తెలిపారు. మృతులను ఇర్ఫానా బేగం (25), రూబియా బేగం (50), అబేదాబీ బేగం (50), జయ చున్‌బీ (60), మునీర్ (28), మహ్మద్ అలీ (38), షౌకత్ అలీ (29) గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo