బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 24, 2020 , 20:06:06

ప్రాణాలు తీసిన సెల్ఫీ పిచ్చి

ప్రాణాలు తీసిన సెల్ఫీ పిచ్చి

సూర్యాపేట : సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదికొచ్చింది. సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టులో ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..  నకిరేకల్‌ పట్టణం వాసవీనగర్‌కు చెందిన సాయికుమార్‌(22) తన స్నేహితులు మరో ఆరుగురితో కలిసి ఆదివారం మూసి ప్రాజెక్టుకు వెళ్లాడు.

ప్రాజెక్టు గేట్ల కింద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా అక్కడ స్నేహితులతో ఈత కొడుతూ సంతోషంగా గడుపుతున్నారు. ఇంతలో సాయి సెల్ఫీ దిగుదామని చెప్పి తన సెలఫోన్‌ తీసుకొచ్చి తీస్తుండగా వరద తాకిడికి కాలు జారి నీటిలో పడిపోయాడు. వెంటనే స్నేహితులు అతడిని కాపాడే ప్రయత్నం చేసినా రాళ్ల మధ్యలో ఇరుక్కుపోవడంతో సాధ్యం కాలేదు. అనంతరం నీళ్లలో తేలిన మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నకిరేకల్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo