బుధవారం 27 జనవరి 2021
Crime - Nov 11, 2020 , 19:17:26

రూ.2.50 లక్షల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

రూ.2.50 లక్షల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను జిల్లాలోని మునగాల పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ  సత్యనారాయణగౌడ్‌ వివరాలు వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన ఆదారపు నరేశ్‌, డ్రైవర్‌ కాశీ గుట్కాల ఆటోతో మునగాలలో సంచరిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఆటోను తనిఖీ చేశారు. అందులో లభించిన రూ.2.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


logo