శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Sep 01, 2020 , 16:58:02

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

మంచిర్యాల : అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని తాండూర్ మండలంలో అక్రమంగా ఆటోల్లో తరలిస్తున్న సుమారు (18) క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. తాండూర్ మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి కొందరు పీడీఎస్ బియ్యం సేకరించి తమ వాహనాల్లో అక్రమంగా మహారాష్ట్ర తరలిస్తున్నారనే  సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు.

తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఆటోల్లో సుమారు 18 క్వింటాళ్ల  బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సీఐ కిరణ్, ఎస్ఐ కిరణ్, సిబ్బంది వెంకటేశ్వర్లు శ్రీ, నివాస్, శ్యామ్ సుందర్, భాస్కర్ గౌడ్, రాకేష్ పాల్గొన్నారు.


logo