గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 22, 2020 , 15:45:42

రూ.15 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

రూ.15 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

పాట్నా : బిహార్ రాష్ర్టం పాట్నా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) ఓ స్మగ్లర్‌ వద్ద నుంచి మూడు కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి రైలులో హెరాయిన్ తీసుకువస్తున్నట్లు డీఆర్‌ఐ బృందానికి అందిన సమాచారం మేరకు తనిఖీలు జరిపి నిందితుడి వద్ద నుంచి 3 కేజీల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ హెరియిన్‌ విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ ప్రతినిధులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన కిషన్‌లాల్‌ రాక్సౌల్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి కోరిక మేరకు ఎంపీ నుంచి హెరాయిన్‌ను తరలిస్తున్నాడు. ముందే అందిన సమాచారం మేరకు డీఆర్‌ఐ సిబ్బంది పాట్నా జంక్షన్ వద్ద నిందితుడిని తనిఖీలు చేయగా 3 కిలోల బరువున్న అతడి బ్యాగ్‌లో 5 ప్యాకెట్ల హెరాయిన్ దొరికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర రూ.15 కోట్లు ఉంటుందని సమాచారం. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo