సోమవారం 18 జనవరి 2021
Crime - Dec 15, 2020 , 21:58:16

రూ.12 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టివేత

రూ.12 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టివేత

హైదరాబాద్‌ : ఉప్పల్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామంతాపూర్ ఇందిరానగర్‌లో అక్రమంగా నిల్వ చేసిన రూ. 12 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ దందాకు పాల్పడుతున్న వెలిశెట్టి సాయి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇందిరానగర్‌కు చెందిన వెలిశెట్టి సాయి అక్రమంగా గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు మల్కాజ్‌గిరి ఎస్ఓటీ పోలీసులు సమాచారం అందింది. ఈ మేరకు మంగళవారం సాయికి చెందిన గోదాంపై  దాడి చేసి వివిధ బ్రాండ్లకు చెందిన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకుపాటు నిందితుడిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.