శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 17, 2020 , 17:07:12

ఎనిమిది లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఎనిమిది లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఖమ్మం : పక్క రాష్ట్రం నుంచి నిషేధిత గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్న నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం తల్లాంపాడు గ్రామానికి చెందిన పుచ్చకాయల సురేష్ ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్లు విక్రయాలు జరిపేందుకు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి కొనుగోలు చేసి చట్టవిరుద్ధంగా జిల్లాకు అక్రమ రవాణా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో సీఐ వెంకట స్వామి, ఎస్ఐ ప్రసాద్  తమ సిబ్బందితో కలిసి కూసుమంచి వద్ద తనిఖీలు నిర్వహించారు.

అనుమానాస్పదంగా వస్తున్న (ఏపీ 16 సిడి 0345) నెంబరు గల కారును అపి తనిఖీ చేశారు. అందులో నిషేధిత పొగాకు ఉత్పత్తులు అంబర్, గోవా,  మిరాజ్   "19" సంచులను గుర్తించారు.  వీటి విలువ రూ. 8,35,000 ఉంటుందని ఏసీపీ తెలిపారు. కాగా, తల్లాంపాడు గ్రామానికి చెందిన కారు డ్రైవర్ యాలవల్లి సునీల్ పరారీలో ఉన్నాడని, అదుపులోకి తీసుకొన్న సురేష్‌పై చట్టపరమైన చర్యల నిమిత్తం కుసుమంచి పోలీసు స్టేషన్ లో అప్పగించినట్లు వెంకట్రావు తెలిపారు. తనిఖీల్లో కానిస్టేబుల్ చెన్నారావు, కళింగారెడ్డి, హమీద్, రామారావు పాల్గొన్నారు.


logo