గురువారం 26 నవంబర్ 2020
Crime - Sep 23, 2020 , 18:53:03

94 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

94 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

నల్లగొండ : లబ్ధిదారుల నుంచి అక్రమంగా సేకరించి తరలిస్తున్న 94 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని వేర్వేరు చోట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని మిర్యాలగూడ మండలం కురారియా తండా నుంచి బొలేరో వాహనంలో తరలిస్తున్న 70 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్‌ చేశారు. అలాగే చందంపేట మండలంలోని గుంటిపల్లి స్టేజీ వద్ద బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 24 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు.