మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Sep 08, 2020 , 18:04:20

అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

ఖమ్మం : అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..ఈ రోజు తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్  బృందం నేలకొండపల్లి మండల కేంద్రం వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. AP 16 TY 4037 నెంబరు గల లారీలో ఎలాంటి పత్రాలు లేకుండా కోదాడ నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న రూ. 5,40,000  విలువ గల 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.

లారీ డ్రైవర్ పారిపోయాడు. కోదాడ కు చెందిన కె. రమేష్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. చట్టపరమైన చర్యలు తీసుకున్నందుకు బియ్యంతో పాటు లారీని ఎస్‌హెచ్‌వో నేలకొండపల్లి పీఎస్‌కు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు. తనిఖీల్లో సీఐ వెంకటస్వామి, ఎస్‌ఐ ప్రసాద్, కానిస్టేబుల్ శ్రీనివాస రావు, రవి, రామకృష్ణ, కోటేశ్వర రావు పాల్గొన్నారు.


logo