శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 06, 2020 , 16:22:27

130 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

130 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

నల్లగొండ : పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న 130 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మల్లేపల్లి పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని కొండ మల్లేపల్లి సీఐ పరుశురాం నేతృత్వంలో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచరంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 18 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఐదు ద్వి చక్ర వాహనాలు, రెండు తుఫాన్ వాహనాలు, రెండు మహేంద్రా బొలెరో వాహనాలతో పాటు ఒక అశోకా లేల్యాండ్ వాహనం, టాటా ఇండికా కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు.


logo