శుక్రవారం 04 డిసెంబర్ 2020
Crime - Oct 22, 2020 , 14:52:18

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 లారీల పట్టివేత

 అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 లారీల పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం : అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు.  పోలీసుల కథనం మేరకు..ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కుంట నుంచి అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్న 12 ఇసుక లారీలను ఎస్కార్ట్ గా వస్తున్న 3 కార్లను పాల్వంచ పోలీసులు గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు. డీఎస్పీ కేఆర్‌కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ, రూరల్ ఎస్‌ఐ సుమన్‌ పాల్వంచ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామం ప్రధాన రహదారి వద్ద ఇసుక లారీలను తనిఖీ చేశారు. వారి వద్ద ఎలాంటి కాగితాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకొని కిన్నెరసానిలోని రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.