శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 19, 2020 , 19:00:27

హైదరాబాద్ లో 104 గ్రాముల కొకైన్ పట్టివేత

హైదరాబాద్ లో 104 గ్రాముల కొకైన్ పట్టివేత

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరొకసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను పోలీసులు పట్టుకోవడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల వివరాల ప్రకారం.. నైజీరియన్ దంపతులు జుది, మౌనిక్ లనుఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్  అధికారులు విశ్వసనీయ సమాచారంతో వల పన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 104 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి వీరు కొకైన్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.logo