శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 17, 2020 , 16:43:08

100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

ఖమ్మం : ప్రభుత్వం పేదలకు సబ్సిడీగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని తక్కువ ధరలకు కోనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు నిల్వ చేసిన బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కారేపల్లి మండలంలోని మణికారామ్ గ్రామంలో దివంగత అనంత రామయ్య పాత బంగ్లా వద్ద అక్రమంగా నిల్వ వుంచిన 100 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు వివరాలను వెల్లడించారు.

సీఐ వెంకటస్వామి, ఎస్‌ఐ ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించి పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నామన్నారు. కారేపల్లి మండలంలోని గదేపాడు గ్రామానికి చెందిన జంపాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి  పీడీఎస్ బియ్యాన్ని రేషన్ షాపు డీలర్ల నుంచి కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించడానికి అనంత రామయ్య పాత బంగ్లా వద్ద అక్రమంగా నిల్వ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జంపాల వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. తనిఖీల్లో కానిస్టేబుల్ చెన్నారావు, కళింగారెడ్డి, హమీద్, రామారావు పాల్గొన్నారు.


logo