బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 20, 2020 , 21:10:46

సంగారెడ్డిలో సెక్యూరిటీ గార్డు ఆత్మ‌హ‌త్య‌

సంగారెడ్డిలో సెక్యూరిటీ గార్డు ఆత్మ‌హ‌త్య‌

సంగారెడ్డి : సెక్యూరిటీ గార్డు సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘ‌ట‌న సంగారెడ్డి జిల్లా అమీన్‌పురా పోలీస్ స్టేష‌న్ ప‌రిధి గండిగూడెంలో గ‌ల అగ‌ర్వాల్ స్టీల్స్‌లో ఆదివారం చోటుచేసుకుంది. మృతుడిని అమిత్ కుమ‌ర్ మిశ్రా(18)గా గుర్తించారు. ఐడీఏ బొల్లారం నివాసి. మిశ్రా డ్యూటీ నిమిత్తం శ‌నివారం రాత్రి కంపెనీకి వ‌చ్చాడు. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణం తెలియ‌లేద‌ని ఎస్ఐ ఎస్ ముర‌ళి తెలిపారు. కేసు న‌మోదు చేసుకుని మృత‌దేహాన్ని ప‌టాన్‌చెరు ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు పేర్కొన్నారు.


logo