సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 08, 2020 , 11:34:19

వృద్ధురాలిపై దాడి చేసిన సెక్యూరిటీ గార్డు అరెస్టు

వృద్ధురాలిపై దాడి చేసిన సెక్యూరిటీ గార్డు అరెస్టు

ప్రయాగ్‌రాజ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో వృద్ధురాలిపై దాడి చేసిన సెక్యూరిటీ గార్డును శనివారం అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పీ) అభిషేక్ దీక్షిత్ తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌ ప్రయాగ్రాజ్ జిల్లాలోని స్వరూప్ రాణి ఆసుపత్రి ఇటీవల చికిత్స కోసం వచ్చిన వృద్ధురాలితో దురుసుగా ప్రవర్తించిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు సంజయ్ మిశ్రా ఆమెపై దాడి చేశాడు. దాడి ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యింది. వీడియో పోలీసుల దృష్టికి వెళ్లగా వెంటనే సెక్యూరిటీ గార్డును అరెస్టు చేసినట్లు ఎస్ఎస్పీ చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.


logo