గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 22:00:48

స్పా.. మసాజ్‌ సెంటర్ల పేరుతో గుట్టుగా వ్యభిచారం!

స్పా.. మసాజ్‌ సెంటర్ల పేరుతో గుట్టుగా వ్యభిచారం!

తంజావూరు : మసాజ్‌ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై పోలీసులు దాడులు చేసి సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు చేశారు. మూడు పోలీస్‌ బృందాలు వేర్వేరుగా దాడులు జరిపి 19 మంది విటులను అదుపులోకి తీసుకొని 9 మంది యువతులను రక్షించి షెల్టర్ హోంకు తరలించారు. ఏపీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు జరిపినట్లు తమిళనాడు పోలీసులు గుర్తించారు.

తంజావూర్ ఎస్పీ దేశ్‌ముఖ్ శేఖర్ సంజయ్ ముగ్గురు ఎస్‌ఐలతో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఈ సెక్స్‌ రాకెట్‌పై దాడులు జరిపారు. నగరంలోని కావేరి నగర్, మూవేందర్ నగర్, మంగళాపురం, మునిసిపల్ కాలనీ, హెర్బల్ ఫామ్ ఏరియా తదితర ప్రదేశాల్లో ఇండ్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై దాడులు చేశారు. మరికొన్ని చోట్ల మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo