మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 10, 2020 , 21:08:47

రెండో భార్య పిల్ల‌ల్ని చంపి మ‌హిళ‌ ఆత్మ‌హ‌త్య‌

రెండో భార్య పిల్ల‌ల్ని చంపి మ‌హిళ‌ ఆత్మ‌హ‌త్య‌

నల్లగొండ : జిల్లా కేంద్రంలో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. భ‌ర్త రెండో భార్య‌కు చెందిన ఇద్ద‌రు పిల్ల‌ల్ని మొద‌టి భార్య చంపి తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంది. న‌ల్ల‌గొండ క‌లెక్ట‌రేట్ స‌మీపంలో గురువారం ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. మేక‌ల ప్ర‌దీప్‌, ప్ర‌స‌న్న‌రాణి ఇరువురు దంప‌తులు. ప్ర‌స‌న్న‌రాణిని కొన్నాళ్ల‌క్రితం ప్ర‌దీప్ వ‌దిలేశాడు. శాంతి అనే మ‌హిళ‌ను రెండో పెండ్లి చేసుకున్నాడు.  వీరిరువురికి మేఘ‌న‌(6), రుచ‌రి(4) ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు.  ఆస్తి త‌గాదాల నేప‌థ్యంలో భ‌ర్త‌ రెండో భార్య కుటుంబంపై క‌క్ష్య పెంచుకున్న మొద‌టి భార్య.. రెండో భార్య సంతానం ఇద్ద‌రు అమ్మాయిల మెడ‌ల‌కు తాళ్లు బిగించి హ‌త్య చేసింది. అనంత‌రం తాను సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ప్ర‌దీప్ రామ‌న్న‌పేట‌లో, ప్ర‌స‌న్న‌రాణి మునుగోడులో, శాంతి జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ఐసీడీఎస్ ఆప‌రేట‌ర్లుగా ప‌నిచేస్తున్నారు. 

అనుమానాస్ప‌ద‌రీతిలో కార్మికుడు మృతి..

వరంగల్ రూరల్ : జిల్లాలోని నెక్కొండ మండలం అమీన్‌పేట గ్రామ శివారులోని భవాని కాటన్ మిల్లులో కార్మికుడు బోలేసింగ్ (24) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ర్ట నివాసి. మిల్లును సందర్శించిన పోలీసులు కార్మికుడి మృతిపై విచారణ చేప‌ట్టారు.logo