మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Sep 09, 2020 , 19:19:19

ఫీజు చెల్లించ‌నందుకు.. విద్యార్థి సోద‌రిపై పాఠ‌శాల‌ చైర్మ‌న్ లైంగిక‌దాడి

ఫీజు చెల్లించ‌నందుకు.. విద్యార్థి సోద‌రిపై పాఠ‌శాల‌ చైర్మ‌న్ లైంగిక‌దాడి

నోయిడా : ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ర్టం గ్రేట‌ర్ నోయిడాలో అమానుష ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఫీజు చెల్లించలేమ‌ని చెప్పేందుకు యువ‌తి పాఠ‌శాల‌కు వెళ్ల‌గా చైర్మ‌న్ ఆమెపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. వివ‌రాలు.. నోయిడాలోని ఎకోటెక్‌-3 ప్రాంతంలోని ఓ పాఠ‌శాల యాజ‌మాన్యం ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థికి సంబంధించి బ‌కాయి ఫీజు చెల్లించాల్సిందిగా ప‌లుమార్లు ఇంటికి ఫోన్ చేసింది. లాక్‌డౌన్ కావ‌డంతో త‌మ‌వ‌ద్ద డ‌బ్బు లేద‌ని, ఇప్ప‌డు ఫీజు చెల్లించ‌లేమ‌ని విద్యార్థి సోద‌రి 20 ఏండ్ల త‌హ్రీర్.. ప‌లుమార్లు పాఠ‌శాల‌కు వెళ్లి చైర్మ‌న్‌ను క‌లిసి త‌మ ఆర్థిక ప‌రిస్థితి గురించి న‌చ్చ‌జెప్ప‌డంతో సరేన‌ని ఊరుకున్నాడు. ఈ నేప‌థ్యంలో యువ‌తిపై క‌న్నేసిన చైర్మ‌న్ నీర‌జ్ భాటి.. కొన్నాళ్ల త‌రువాత మ‌ళ్లీ ఇంటికి ఫోన్ చేసి ఫీజు క‌ట్ట‌లేక‌పోతే మీ సోద‌రుడి టీసీ తీసుకెళ్లాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఈ నెల ‌4న త‌హ్రీర్ టీసీ కోస‌మ‌ని పాఠ‌శాల‌కు వెళ్ల‌గా చైర్మ‌న్ ఆమెపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. అంతేకాకుండా ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరించాడు. 

భ‌యంతో యువ‌తి జ‌రిగిన విష‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌కు చెప్ప‌డంతో వారు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు పాఠ‌శాల చైర్మ‌న్‌ను అదుపులోకి తీసుకొని జైలుకు త‌ర‌లించామ‌ని డీసీపీ బృందా శుక్లా మంగ‌ళ‌వారం తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo