స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల పెళ్లి తేదీని ప్రకటించింది. గత కొన్నాళ్లుగా తమిళ నటుడు విష్ణు విశాల్ తో ఈ అమ్మడు ప్రేమలో ఉంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ జోడీ నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటిస్తామని ఇటీవలే విష్ణు విశాల్ చెప్పాడు. చెప్పినట్లే గుత్తా జ్వాల, విష్ణు విశాల్ తమ పెళ్లి తేదీని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఇరు కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో మేము పెళ్లి చేసుకుంటున్నామని గుత్తాజ్వాల, విశాల్ లు తెలిపారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ నెల 22 వ తేదీన తమ పెళ్లి జరుగుతుందని ప్రకటించారు. ఇన్నేళ్లుగా తమపై ప్రేమాభిమానాలు కురిపిస్తోన్న అందరికీ కృతజ్ఞతలు చెబుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.