ఆదివారం 24 జనవరి 2021
Crime - Dec 26, 2020 , 14:36:11

వివాహిత‌ హ‌త్య కేసును ఛేదించిన పోలీసులు

వివాహిత‌ హ‌త్య కేసును ఛేదించిన పోలీసులు

సంగారెడ్డి : రాజంపేట‌కు చెందిన వివాహిత జ్యోతి ఇటీవ‌ల‌ హ‌త్య‌కు గురైన విష‌యం విదిత‌మే. ఈ హ‌త్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు చిన్న‌య్య‌ను పోలీసులు అరెస్టు చేశారు. 14వ తేదీన వివాహిత‌ను ఇంటి నుంచి తీసుకెళ్లి, న‌ర్సాపూర్ రోడ్డు వ‌ద్ద అత్యాచారం చేశాడు చిన్న‌య్య‌. ఆ త‌ర్వాత ఆమె గొంతు నులిమి చంపేశాడు. అయితే జ్యోతి మృత‌దేహాం 17వ తేదీన ల‌భ్య‌మైంది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. జ్యోతిని హ‌త్య చేసిన చిన్న‌య్య‌ను పోలీసులు నిన్న అరెస్టు చేసి రిమాండ్ త‌ర‌లించారు. నిందితుడి స్వ‌స్థ‌లం వికారాబాద్ జిల్లా నాగ‌స‌ముద్రం. మృతురాలు జ్యోతికి భ‌ర్త‌, కుమారుడు, కూతురు ఉన్నారు. 


logo