గురువారం 21 జనవరి 2021
Crime - Dec 20, 2020 , 17:10:21

అమెరికాలో సంగారెడ్డి జిల్లా వాసి మృతి

అమెరికాలో సంగారెడ్డి జిల్లా వాసి మృతి

సంగారెడ్డి : అమెరికాలోని చికాగో నగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి  జిల్లా వాసి మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. జిల్లాలోని మునిపల్లి మండలం మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన ఎండీ మోహిజ్ (31)  2015లో ఉన్నత చదువుల కోసం వెళ్లి జాబ్ సంపాదించాడు. కాగా 2019 సెప్టెంబర్‌లో వివాహం చేసుకొని కుటుంబ సభ్యలతో అమెరికాలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే పని నిమిత్తం కారులో శనివారం వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యలను పోషించే పెద్దకొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


logo