బుధవారం 30 సెప్టెంబర్ 2020
Crime - Aug 10, 2020 , 14:10:54

రూ.50 కోట్ల విలువైన గంధం చెక్కలు సీజ్‌

రూ.50 కోట్ల విలువైన గంధం చెక్కలు సీజ్‌

అమ్రోహ : ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లా కేంద్రంలోని గోదాములో అక్రమంగా నిల్వ చేసిన రూ. 50 కోట్ల విలువైన అతి నాణ్యమైన గంధం చెక్కులను పోలీసులు సీజ్‌ చేశారు. గోదాములో భారీగా గంధం చెక్కలు నిల్వ చేశారన్న విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు, ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. గంధం చెక్కులను గుర్తించి సీజ్‌ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అటవీశాఖ అధికారులు గంధం చెక్కలను పరిశీలించి సుమారు రూ. 50 కోట్ల విలువ ఉంటాయని అంచనా వేశారని అమ్రోహ ఎస్పీ విపిన్‌ తాండ తెలిపారు. నిందితులు గంధం చెక్కలను ఇక్కడి నుంచి చైనా, జపాన్‌ దేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.  నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 


logo