గురువారం 21 జనవరి 2021
Crime - Nov 10, 2020 , 14:21:37

బైక్‌ను ఢీకొట్టిన ఇసుక లారీ.. వృద్ధురాలు దుర్మరణం

బైక్‌ను ఢీకొట్టిన ఇసుక లారీ.. వృద్ధురాలు దుర్మరణం

పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డు చౌరస్తాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. నర్సంపేట మండలం నక్కినపెల్లి గ్రామానికి చెందిన జమాల్ తన తల్లి ముత్తమ్మతో కలిసి బైక్‌పై వెళ్తూ కూనారం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముత్తమ్మ అక్కడికక్కడే మృతి చెందగా జమాల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పెద్దపెల్లి ఎస్ఐ రాజేశ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ అతివేగం కారణంగానే ప్రమాదం జరినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo