ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 07, 2020 , 19:22:35

అధిక ధ‌ర‌కు ద‌గ్గు మందు విక్ర‌యం.. ఫార్మ‌సీ య‌జ‌మాని అరెస్టు

అధిక ధ‌ర‌కు ద‌గ్గు మందు విక్ర‌యం.. ఫార్మ‌సీ య‌జ‌మాని అరెస్టు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, డ్ర‌గ్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా న‌గ‌రంలోని  గోషామ‌హ‌ల్ ప‌రిధి దారుస్సాలాంలో గ‌ల అగ‌ర్వాల్ ఫార్మ‌సీపై రైడ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎటువంటి ప్రిస్ర్కిప్ష‌న్ లేకుండా మైన‌ర్ల‌కు మందులు విక్ర‌యించ‌డం, ద‌గ్గు మందును అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించిన కార‌ణంగా ఫార్మ‌సీ య‌జ‌మానిని అరెస్టు చేశారు. దుకాణ‌దారుడి నుంచి 150 ద‌గ్గు సిర‌ఫ్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... సాధార‌ణంగా ద‌గ్గు సిర‌ఫ్‌ల‌ను డాక్ట‌ర్ ప్రిస్క్ర‌ప్ష‌న్ ఉంటేనే అమ్మాలి. వైద్యుడి సల‌హా లేకుండా వాడితే ప్ర‌మాద‌క‌రం. అధికారిక గుర్తింపు పొందిన మెడిక‌ల్ ప్రాక్టిష‌న‌ర్ సూచ‌న మేర‌కు వినియోగ‌దారుల‌కు అమ్మాలి. అటువంటిది ఎటువంటి ప్రిస్ర్కిప్ష‌న్ లేకుండా మైన‌ర్ల‌కు విక్ర‌యించ‌డం అదేవిధంగా అధిక ధ‌ర‌ల‌కు అమ్ముతూ సొమ్ముచేసుకోవ‌డం వంటి చ‌ర్య‌ల‌కు దుకాణ‌దారుడు పాల్ప‌డుతున్న‌ట్లు తెలిపారు. 

అధిక మొత్తంలో సిర‌ఫ్‌ను తీసుకుంటే మాద‌క‌ద్ర‌వ్యాలు తీసుకున్న మ‌త్తు క‌లుగుతుంద‌న్నారు. ఇది చాలా ప్ర‌మాద‌క‌రం అన్నారు. ఈ అల‌వాటు నేర‌పూరిత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డేందుకు కార‌ణం అవుతుంద‌న్నారు. స్వాధీనం చేసుకున్న మందుల‌ను, అగ‌ర్వాల్‌ను బేగంబ‌జార్ పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించిన‌ట్లు వెల్ల‌డించారు.


logo