ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 09, 2020 , 16:32:23

ఆశ్ర‌మంలో సాధ్విపై సామూహిక అత్యాచారం!

ఆశ్ర‌మంలో సాధ్విపై సామూహిక అత్యాచారం!

రాంచి: ‌జార్ఖండ్ రాష్ట్రం గొడ్డా జిల్లాలో దారుణం జ‌రిగింది. అక్కడి ఆశ్రమంలో ఉంటున్న 36 ఏండ్ల సన్యాసిని (సాధ్వి)పై న‌లుగురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. తుపాకితో బెదిరించి ఆగంతకులు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టారు. గ‌త సోమ‌వారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది.

ప్ర‌త్య‌క్ష సాక్ష్యుల క‌థ‌నం ప్రకారం.. సాయుధులైన నలుగురు దుండ‌గులు గొడ్డా జిల్లాలోని మహిళా సత్సంగ్ ఆశ్రమం ప్రహ‌రిగోడ దూకి లోపలకు వెళ్లారు. ఆశ్రమవాసులను వేర్వేరు గదుల్లో బంధించారు. అనంత‌రం 36 ఏండ్ల సాధ్విని ఒక గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం జ‌రిగిన స‌మ‌యంలో ఆశ్రమంలో ఒకరే మగవ్యక్తి ఉన్నారు. ఘటనపై ఆయన మాట్లాడుతూ.. సోమవారం రాత్రి నలుగురు సాయుధులు ఆశ్రమంలోకి చొరబడ్డారని, తాను ఆపేందుకు ప్రయత్నించగా తనను కొట్టి ఒక గదిలో బంధించారని చెప్పారు. 

కాగా, బాధితురాలి ఫిర్యాదు మేర‌కు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మ‌రో ముగ్గురు ప‌రారీలో ఉన్నార‌ని త్వ‌ర‌లోనే వారిని ప‌ట్టుకుంటామ‌ని చెప్పారు. ఘ‌ట‌న‌పై వేగంగా దర్యాప్తు జరుపుతున్న‌ట్లు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo