మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Aug 11, 2020 , 16:47:41

కుక్క కోసం నిండు ప్రాణం బలి

కుక్క కోసం నిండు ప్రాణం బలి

ఖమ్మం : కుక్క కోసం నిండు ప్రాణాన్ని బలికొన్న విషాద సంఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయ గ్రామంలో  మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానిక ఎస్ఐ సురేష్ తెల్పిన సమాచారం మేరకు.. తాళ్లపాయ గ్రామానికి చెందిన పద్దం జోగులు (48), కూరం వీరస్వామి పక్కపక్క ఇండ్లలలో నివసిస్తున్నారు. సోమవారం ఉదయం వీరస్వామి కి చెందిన పెంపుడు కుక్క జోగులు ఇంట్లోకి వెళ్లి వాళ్ల  సొంత కుక్క కోసం పెట్టిన అన్నం తింటుండగా జోగులు భార్య బజారమ్మ దానిని కొట్టింది.

దీంతో ఆగ్రహించిన వీరస్వామి తాను పెంచుకుంటున్న కుక్కను కొడతావా అంటూ తన భార్య తో కలిసి  వీరస్వామి బజారమ్మపై దాడి చే శాడు. సాయంత్రం ఊరేళ్లి ఇంటికి చేరుకున్న జోగులుకు భార్య జరిగిన విషయం తెలపింది. దీంతో జోగులు తనఇంట్లో  కంచె ఇవతల ఉండి వీరస్వామిని పిలిచి కుక్క కోసం తన భార్యపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించగా అప్పటికే మద్యం మత్తులో ఉన్న వీరస్వామి జోగులు తలపై పెద్ద కర్రతో బాదాడు .

తలకు తీవ్ర గాయం కావడంతో జోగులు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కొత్తగూడెం తరలించగా.. చికిత్స పొందుతూ జోగులు మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య కొడుకు ఉన్నారు. భార్య బజారమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు వీరస్వామిని అదుపులోకి తీసుకున్నారు.logo