శనివారం 28 నవంబర్ 2020
Crime - Oct 29, 2020 , 18:12:17

ఏసీబీకి చిక్కిన ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ

ఏసీబీకి చిక్కిన ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ

వరంగల్‌ రూరల్‌ : జిల్లాలోని నర్సంపేటలో పనిచేస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ రాము, రూ.4వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుపడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌ తెలిపిన వివరాల మేరకు.. ఖనాపురం మండలం మనుబోతుల గడ్డకు చెందిన కాంట్రాక్టర్‌ బోదాసు రాజకొంరయ్య ఖానాపురం మండలం పెద్దమ్మగడ్డ, పెద్దమ్మగడ్డ తండా, మనుబోతుల గడ్డ, బోటిమీది మామిడి తండాలో రూ.19లక్షల విలువైన మిషన్‌ భగీరథ పనులు చేశాడు. 20శాతం పనుల బిల్లులు ఆపారు. అదనంగా 1500 మీటర్ల పైపులైన్‌, నల్లాల బిగింపు, గద్దెల నిర్మాణానికి రూ. లక్ష బిల్లు రావాల్సి ఉంది. 20శాతం బిల్లులు రూ.20వేలు, అదనపు పనుల బిల్లు రావాలంటే రూ.4వేలు ఇవ్వాలని డీఈ రాము డిమాండ్‌ చేయడంతో వారం క్రితం రాజకొంరయ్య ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం రాముకు రాజకొంరయ్య డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.