శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Crime - Jan 24, 2021 , 21:50:10

రూబీ గోల్డ్ య‌జ‌మాని ఇఫ్స‌ర్ రెహ‌మాన్ అరెస్టు

రూబీ గోల్డ్ య‌జ‌మాని ఇఫ్స‌ర్ రెహ‌మాన్ అరెస్టు

హైద‌రాబాద్ : రూబీ గోల్డ్ య‌జ‌మాని ఇఫ్స‌ర్ రెహ‌మాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న‌గ‌రంలోని బీహెచ్‌ఈఎల్‌లో గ‌ల‌ ఓ ఇంట్లో తమిళనాడు, తెలంగాణ పోలీసులు ఆదివారం సంయుక్తంగా తనిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చెన్నైలోని రూబీ గోల్డ్‌ స్కాంలో యజమాని ఇఫ్సర్‌ రెహమాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వడ్డీలేని రుణాలు ఇస్తానని భారీగా ఆభరణాలు తీసుకుని దాదాపు 1500 మందిని మోసం చేశాడు. ఇఫ్సర్ రూ.300 కోట్ల విలువైన వెయ్యి కిలోల బంగారాన్ని సేకరించిన‌ట్లుగా స‌మాచారం. బంగారు విలువకు మూడొంతుల డబ్బు ఇస్తానని నమ్మించి మోసానికి పాల్ప‌డ్డాడు. 2019 నుంచి పరారీలో రెహ‌మాన్‌ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఇఫ్సర్‌ సోదరుడు అనీస్‌ రెహమాన్‌, మరో ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.


VIDEOS

logo