సోదరిపై ఆర్టీఐ కార్యకర్త అత్యాచారం.. కేసు నమోదు!

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ 30 ఏండ్ల ఆర్టీఐ కార్యకర్త వరుసకు సోదరియైన 17 ఏండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముంబై నగర శివార్లలోని మల్వాని ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మల్వానిలోని ఇరుగుపొరుగు ఇండ్లలోనే నిందితుడు, బాధితురాలు నివాసం ఉంటున్నారు. వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే, బాలిక తనపై జరిగిన దారుణం గురించి తన తల్లికి వివరించింది. దీంతో ఆమె బాధితురాలితో కలిసి వెళ్లి మల్వానీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అతనిపై పోక్సో చట్టం కింద, ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.