ఆదివారం 17 జనవరి 2021
Crime - Nov 08, 2020 , 21:45:56

బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. హోంగార్డు దుర్మరణం

బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. హోంగార్డు దుర్మరణం

ఖమ్మం : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో హోంగార్డు దుర్మారణం చెందాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచర్లగూడెం గూడెం క్రాస్ రోడ్డు వద్ద ఖమ్మం-కోదాడ రహదారిపై ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. నేలకొండపల్లికి చెందిన చిన్నంశెట్టి నర్సింహారావు (50) ముదిగొండ పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.

సాయంత్రం విధులు ముగించుకొని స్వగ్రామం నేలకొండపల్లికి బైక్‌పై వస్తుండగా ఆచర్లగూడెం క్రాస్‌రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో నర్సింహారావు తల ఛిదమై ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నర్సింహారావు మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.