గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Jul 30, 2020 , 12:50:22

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు .. డ్రైవర్ దుర్మరణం

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు .. డ్రైవర్ దుర్మరణం

మెదక్ : ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన జిల్లాలోని చేగుంట బైపాస్ వద్ద బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..హైదారాబాద్ నుంచి బస్సు నిర్మల్ వెళ్తుండగా (నిర్మల్ డిపో బస్సు) ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ విశ్వనాథం (41) మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా దవాఖానకి తరలించినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.


logo